Jagan: ఏపీలో కాబోయే సీఎం జగనే: టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి కీలక వ్యాఖ్యలు

  • వచ్చే సంవత్సరం ఎన్నికల్లో గెలిచేది జగనే
  • చంద్రబాబు అడ్రస్ గల్లంతుకావడం ఖాయం
  • కేసీఆర్ ను ఎవరూ గద్దె దింపలేరన్న నాయిని
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేది వైఎస్ జగనేనని తెలంగాణ హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని,  ఎన్నికల తరువాత ఏపీలో తెలుగుదేశం పార్టీకి చిరునామా కూడా ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ పరిధిలోని ఛత్రినాక ప్రాంతంలో టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన సభకు వచ్చిన ఆయన ప్రసంగిస్తూ, కేసీఆర్ ను గద్దె దించాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని అన్నారు. కేసీఆర్ ను ఓడించడం ఎవరితరమూ కాదని వ్యాఖ్యానించారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీలతో టీఆర్ఎస్ ను పోల్చి చూస్తే, ఎవరు బాగా పాలించారో తెలుస్తుందని అన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని నాయిని గుర్తు చేశారు.  కాగా, ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 140 మంది టీఆర్ఎస్ లో చేరేందుకు రాగా, ఆయన వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
Jagan
Chandrababu
Nayini Narsimhareddy
KCR
Telangana
Andhra Pradesh

More Telugu News