KCR: స్పీడు పెంచిన కేసీఆర్... నేడు ఏకంగా 8 సభలు!

  • గడచిన వారం రోజులుగా ప్రచారంలో బిజీ
  • నేడు సొంత నియోజకవర్గంలోనూ సభ
  • బాన్సువాడ నుంచి ప్రారంభం కానున్న నేటి పర్యటన
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తన ఎన్నికల ప్రచారంలో స్పీడును మరింతగా పెంచారు. గడచిన వారం రోజులుగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న ఆయన, నేడు ఏకంగా ఎనిమిది సభల్లో పాల్గొననున్నారు. బాన్సువాడ, జుక్కల్, నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి ఆందోల్, నర్సాపూర్ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఆపై సాయంత్రం తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో ఆయన ప్రచార సభ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ప్రజా ఆశీర్వాద సభల పేరిట ఇవి జరగనున్నాయి. మరికాసేపట్లో హైదరాబాద్ నుంచి బాన్సువాడకు కేసీఆర్ బయలుదేరనున్నారు.
KCR
Telangana
Elections
Campaign

More Telugu News