Hyderabad: అక్క కోసం రంగంలోకి దిగిన తారకరత్న!

  • తన సోదరిని గెలిపించాలన్న తారకరత్న
  • ఓపెన్ టాప్ జీప్ లో బస్తీల్లో ప్రచారం
  • పలువురు నందమూరి కుటుంబీకులు కూడా
తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన నందమూరి సుహాసినికి మద్దతుగా తారకరత్న రంగంలోకి దిగారు. తన సోదరిని గెలిపించాలని కోరుతూ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. ఓపెన్ టాప్ జీప్ లో పలు బస్తీల్లోకి వెళ్లిన ఆయన, సుహాసినిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్ర ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు. సుహాసిని గెలిస్తే, ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. తారకరత్నతో పాటు పలువురు నందమూరి కుటుంబీకులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు.
Hyderabad
Telangana
Kukatpalli
Taraka Ratna

More Telugu News