TRS: టీఆర్ఎస్ కారుకు మజ్లిస్ ఇంజన్ వంటిది: అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

  • టీఆర్ఎస్ ను గెలిపించాల్సిన అవసరం ఉంది
  • కాంగ్రెస్, టీడీపీ పొత్తును చూసి క్షోభిస్తున్న ఎన్టీఆర్ ఆత్మ
  • ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ
తెలంగాణకు జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కారుకు మజ్లిస్ ఇంజన్ వంటిదని వ్యాఖ్యానించిన ఆయన, ఈ ఎన్నికల్లో అవకాశవాద పొత్తులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.

 హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కలయిక ఈస్ట్ ఇండియా కంపెనీ అలయన్స్ లా ఉందని విమర్శించారు. ఈ రెండు పార్టీలూ కలవడాన్ని చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. ప్రజాకూటమి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని, విజయవాడలో కూర్చుని కూకట్ పల్లి భవిష్యత్తును, అభివృద్ధిని చంద్రబాబు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ముస్లిం మైనారిటీల వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే రిజర్వేషన్లను అడ్డుకున్నాయని అసదుద్దీన్ నిప్పులు చెరిగారు.
TRS
Majlis
MIM
Asaduddin Owaisi

More Telugu News