Karnataka: డ్యాన్స్ నేర్పిస్తానంటూ ప్రలోభపెట్టి.. రేప్ చేసిన కన్నడ నటుడు!

  • 'గుళిహట్టి' నటుడు కిరణ్ వాసుదేవ్ పై ఫిర్యాదు
  • ప్రశాంతంగా ఉంటున్నా వదల్లేదన్న యువతి
  • ప్రస్తుతం పరారీలో కిరణ్ వాసుదేవ్
తనకు డ్యాన్స్ నేర్పించి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికిన 'గుళిహట్టి' చిత్ర సహనటుడు కిరణ్ వాసుదేవ్,  తనపై అత్యాచారం చేశాడని వర్ధమాన కన్నడ నటి జ్ఞానభారతి పోలీసులను ఆశ్రయించింది. డ్యాన్స్ మాస్టర్ గా ఉన్న కిరణ్, తనకు ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడని చెప్పిన ఆమె, డ్యాన్స్ నేర్చుకుంటే అవకాశాలు త్వరగా వస్తాయని నమ్మించాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఆయన చెప్పినట్టుగా ఉళ్లాల ఉపనగర్ స్టూడియోకు తాను వెళ్లగా, అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే, ఫేస్ బుక్ లో పరువు తీస్తానని బెదిరించాడని, అతని నుంచి బయటపడి, జరిగిన అన్యాయాన్ని మరచి, ప్రశాంతంగా ఉన్నా వదిలి పెట్టలేదని తెలిపింది. తనకు మరో యువకుడితో నిశ్చితార్థం కాగా, ఆ విషయం తెలుసుకుని, తిరిగి లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం కిరణ్ మహదేవ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు.
Karnataka
Sandalwood
Gulihatti
Kiran Vasudev
Rape

More Telugu News