priyamani: ప్రియమణి అభిమాన హీరో ఎవరో తెలుసా?

  • జూనియర్ ఎన్టీఆర్ ను అందరికంటే ఎక్కువగా అభిమానిస్తా
  • మనసున్న ఉత్తమ నటుల్లో తారక్ ఒకడు
  • నటులంతా గొప్పవారే... కానీ, వ్యక్తిగతంగా నాకు తారక్ అంటేనే ఇష్టం
తాను అందరికంటే ఎక్కువగా అభిమానించే హీరో జూనియర్ ఎన్టీఆర్ అని నటి ప్రియమణి తెలిపింది. ఇండస్ట్రీలో ఉన్న నటులంతా గొప్పవారేనని... కానీ, వ్యక్తిగతంగా తనకు తారక్ అంటేనే ఇష్టమని చెప్పింది. తనకు తెలిసినంత వరకు మనసున్న ఉత్తమ నటుల్లో తారక్ ఒకడని తెలిపింది. తాను తారక్ నే ఆరాధిస్తానని చెప్పింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.

ఎన్నో సినిమాలలో నటించి తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించిన ప్రియమణి... ముస్తఫా రాజ్ అనే బిజినెస్ మెన్ ను ప్రేమించి, పెళ్లాడింది. అనంతరం బుల్లితెరపై ఓ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం తెలుగు సినిమాలలో ఆమె నటించకపోయినా... తమిళ, కన్నడ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది.
priyamani
favourite actor
ntr
tollywood

More Telugu News