raviteja: నాభా నటేశ్ ప్లేస్ లో 'టాక్సీవాలా' హీరోయిన్

షార్ట్స్‌లో చూడండి
రవితేజ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటోని' ఆయన అభిమానులను నిరాశపరిచింది. గత రెండు చిత్రాల పరాజయాలకి ఈ సినిమా కూడా తోడు కావడంతో ఆయన డీలాపడిపోయాడు. తన తదుపరి సినిమా విషయంలో ఆయన మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రవితేజ తదుపరి సినిమా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఉండనుంది.

ఈ సినిమాలో కథానాయికలుగా పాయల్ రాజ్ పుత్ ను .. నాభా నటేశ్ ను ఎంపిక చేసుకున్నారు. 'ఆర్ ఎక్స్ 100'తో పాయల్ రాజ్ పుత్ .. 'సమ్మోహనం' సినిమాతో నాభా నటేశ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల విడుదలైన 'టాక్సీవాలా' సినిమాతో ప్రియాంక జవాల్కర్ కి యూత్ లో క్రేజ్ పెరిగింది. అందువలన రవితేజ సూచనతో ఆమెను ఆయన సినిమాలోకి తీసుకోవాలనే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయట. అంటే, నాభా నటేశ్ ప్లేస్ లో ప్రియాంక జవాల్కర్ ను తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.       
Go Back to Shorts
raviteja
priyanka

More Telugu News