Huawei Mate 20 Pro: 'ఆండ్రాయిడ్ 9.0 పై' ఓఎస్ సపోర్ట్ తో 'హువావే మేట్ 20 ప్రో' స్మార్ట్ ఫోన్ విడుదల!

షార్ట్స్‌లో చూడండి
చైనా మొబైల్ దిగ్గజ సంస్థ హువావే తాజాగా తన నూతన స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. హువావే మేట్ 20 ప్రో పేరిట విడుదలైన ఈ ఫోన్ లో 'ఆండ్రాయిడ్ 9.0 పై' ఓఎస్ తో పాటు అల్ట్రా వైడ్ యాంగిల్ లో పని చేసే మూడు కెమెరాలని ఏర్పాటు చేశారు. అధునాతన కీరిన్ 980 ప్రాసెసర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లాంటి ప్రత్యేకతలున్న ఈ ఫోన్ ధర రూ.69,990గా ఉంది. అమెజాన్ లో ప్రత్యేకంగా విక్రయించనున్న ఈ ఫోన్ 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకి వచ్చే నెల 3 నుండి లభ్యం కానుండగా, సాధారణ సభ్యులకి మరుసటి రోజు నుండి అందుబాటులోకి రానుంది. అలాగే, డిసెంబర్ 10 నుండి క్రోమా స్టోర్లలో కూడా లభించనున్నాయి.

హువావే మేట్ 20 ప్రో ప్రత్యేకతలు:

  • ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టం
  • 40/20/8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
  • 6.39" క్యూహెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (1440 x 3120 పిక్సల్స్)
  • కీరిన్ 980 ప్రాసెసర్
  • 6/8 జీబీ ర్యామ్,128/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్, సూపర్‌ చార్జ్
Go Back to Shorts
Huawei Mate 20 Pro
smartphone
Tech-News
technology
China
India

More Telugu News