kcr: చంద్రబాబును చూసి ఎందుకు భయపడుతున్నావ్: కేసీఆర్ కు వీహెచ్ సూటి ప్రశ్న

  • చంద్రబాబు రావొద్దు.. కానీ సెటిలర్ల ఓట్లు కావాలా?
  • ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు
  • తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారు
ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. అర్థంపర్థం లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సమయంలో ఇచ్చిన హామీల మేరకే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సోనియాగాంధీ చెప్పారని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

తెలంగాణలోకి చంద్రబాబును రానివ్వద్దని చెబుతున్నావని... మరి సెటిలర్ల ఓట్లను ఎందుకు అడుగుతున్నావని నిలదీశారు. మరొకసారి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ కాళ్ల వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారని విమర్శించారు. గజ్వేల్ లో బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. 
kcr
modi
Chandrababu
vh
congress
TRS
Telugudesam
bjp

More Telugu News