sulakshana: ఆయన నా ప్రాణాలు కాపాడారు: సీనియర్ హీరోయిన్ సులక్షణ

షార్ట్స్‌లో చూడండి
తెలుగు.. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్న సులక్షణ, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తనకి ఎదురైన ఒక ప్రమాదం గురించి ప్రస్తావించారు. "కన్నడలో రాజ్ కుమార్ సరసన కథానాయికగా ఒక సినిమా చేస్తున్నాను. ఆ షూటింగు ఊటీలోని ఒక ఎత్తయిన ప్రదేశంలో చేస్తున్నారు. అప్పుడు నాకు కొంచెం బ్రీతింగ్ సమస్య ఉండేది.

అంత ఎత్తులో షూటింగు జరుగుతుండగా నాకు శ్వాస అందక పడిపోయాను. అంతే, అప్పుడు రాజ్ కుమార్ గారు నన్ను మోసుకుంటూ కిందికి తీసుకొచ్చారు. ఆ తరువాత తన కారులో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అలా ఆ రోజున ఆయన నన్ను కాపాడారు" అని అన్నారు. మరో ప్రశ్నకి సమాధానంగా .. "రజనీకాంత్ .. కమలహాసన్ సరసన కథానాయికగా చేశాను. చిరంజీవి గారి సరసన కథానాయికగా చేయాలని ఉండేది .. అది కుదరలేదు" అని ఆమె చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
sulakshana

More Telugu News