BJP: బీజేపీలో చేరిన మాజీ ఐఏఎస్ అపరాజిత!
- 1994 ఒడిశా క్యాడర్ అధికారిణి అపరాజిత
- గతంలో పలు కీలక పోస్టుల్లో పనిచేసిన అపరాజిత
- అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరిక
1994 బ్యాచ్ ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారిణి అపరాజిత, ఈ ఉదయం బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలో అమిత్ షా నివాసానికి వచ్చిన ఆమె, ఆయన సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. 2013 నుంచి సెంట్రల్ డిప్యుటేషన్ పై ఉన్న ఆమె, ఈ నెల 16న స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేయగా, దాన్ని వెంటనే కేంద్రం ఆమోదించింది.
గతంలో అపరాజిత, మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఆమె ఒడిశాలో విధులు నిర్వర్తిస్తున్న కాలంలో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేశారు. అపరాజితను అమిత్ షా వద్దకు ఒడిశా బీజేపీ అధ్యక్షుడు బసంత్ పాండా తీసుకురాగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.