Arun Jaitly: సీఎన్ఎన్ - న్యూస్ 18 మేనేజింగ్ ఎడిటర్ రాధాకృష్ణన్ నాయర్ కన్నుమూత!

  • 1964లో జన్మించిన రాధాకృష్ణన్
  • కేరళ నుంచి న్యూఢిల్లీకి వలస
  • పలు చానళ్లకు సేవలందించిన రాధాకృష్ణన్
  • సంతాపం తెలిపిన అరుణ్ జైట్లీ, కేజ్రీవాల్
ప్రముఖ జర్నలిస్టు, సీఎన్ఎన్ - న్యూస్ 18 మేనేజింగ్ ఎడిటర్ రాధాకృష్ణన్ నాయర్ ఈ ఉదయం మృతిచెందారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. 1964లో జన్మించిన రాధాకృష్ణన్, కేరళ నుంచి ఢిల్లీకి వచ్చి తన ప్రతిభతో పలు పత్రికలు, చానళ్లకు సేవలందించారు.

తొలుత వార్తాసంస్థ 'యూఎన్ఐ'లో చేరిన ఆయన, ఆపై టీవీ చానళ్లలో పనిచేశారు. 'ఇండియా బిజినెస్ రిపోర్ట్' ప్రోగ్రామ్ కు నిర్మాతగా వ్యవహరించారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించగా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. రాధాకృష్ణన్ మృతి భారత పత్రికా రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
Arun Jaitly
Arvind Kejriwal
Radhakrishnan Nayar
Died
Journalist

More Telugu News