Ramgopal Varma: 'మీటూ'లో నా పేరు లేదు... బాలీవుడ్ మొత్తం షాక్: రామ్ గోపాల్ వర్మ

  • దేశవ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం
  • పొద్దున లేస్తే తొడల గురించే మాట్లాడతా
  • నా పేరు లేనందుకు ఆశ్చర్యం: వర్మ
దేశవ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం సాగుతూ, సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖుల రాసలీలలు, అవకాశాలు ఇవ్వడం కోసం వారు హీరోయిన్లను పడకగదుల్లోకి రమ్మని పిలవడంపై ఎంతో మంది నోరువిప్పి ఆరోపణలు చేస్తున్న వేళ, ఈ ఉద్యమంలో తన పేరు రాకపోవడం తనకెంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నాడు. తన సమర్పణలో విడుదలకు సిద్ధమైన 'భైరవగీత' ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వర్మ, మీడియాతో మాట్లాడాడు.

 "నన్ను అలాంటి వాడు, ఇలాంటి వాడని అంటుంటారు. 'మీటూ'లో ఎంతోమంది పేర్లు వచ్చాయి. నా పేరు మాత్రం బయటకు రాలేదు. ఇది బాలీవుడ్ ప్రముఖులను షాక్ కు గురి చేసింది. పొద్దున లేస్తే తొడల గురించి మాట్లాడుతూ, జీఎస్టీ వంటి సినిమాలు చేస్తుంటే నా గురించి ఇక ఏం చెబుతారు?" అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు రామ్ గోపాల్ వర్మ
Ramgopal Varma
MeToo India
Bollywood
Thies
GST

More Telugu News