Vijayasai Reddy: చంద్రబాబు ఆ మాటలన్నా ఆశ్చర్యపోను... హతవిధీ: విజయసాయిరెడ్డి

  • స్వాతంత్య్రం తెచ్చింది తానేనని అంటారు
  • రాజ్యాంగాన్ని దగ్గరుండి రాయించానని కూడా చెబుతారు
  • ఓ నేత తనతో వ్యాఖ్యానించారన్న విజయసాయి
చంద్రబాబు బడాయిలు చెబుతున్నాడని అంటూ తన ట్విట్టర్ ఖాతాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. చంద్రబాబును చూస్తుంటే, దేశానికి స్వాతంత్య్రం
తెచ్చింది తానేనని చంద్రబాబు చెప్పినా ఆశ్చర్యపోనని తనతో ఓ నేత అన్నారని చెప్పుకొచ్చారు.

 "ఆ మధ్య ఢిల్లీలో ఓ తలపండిన రాజకీయ నేత నాతో మాట్లాడుతూ, చంద్రబాబు చెప్పే బడాయిలు చూస్తుంటే ఏదో ఒక రోజు ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది నేనే, భారత రాజ్యాంగం దగ్గరుండి రాయించింది నేనే అని ప్రకటించినా ఆశ్చర్యపోను అన్నారు. కలికాలం! హతవిధి!" అని ట్వీట్ పెట్టారు.

అంతకుముందు మరో ట్వీట్ పెడుతూ, "ల్యాండ్‌ పూలింగ్‌ కింద తీసుకున్న భూములకు బదులుగా రైతులకు 62 వేల ప్లాట్లు  ఇవ్వాలి. అభివృద్ధి చేసి ఇస్తేనే ప్లాట్లు తీసుకుంటామని రైతులు తెగేసి చెప్పినా ప్రభుత్వం వాటివైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రతి సభలో అమరావతి రైతులకు నమస్కరించే చంద్రబాబు వాళ్ళకే మస్కా కొట్టాలని చూస్తున్నాడు" అని ఆరోపించారు.






Vijayasai Reddy
Chandrababu
Twitter

More Telugu News