Naveen Yadav: జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి, రౌడీ షీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ అరెస్ట్

  • యూసుఫ్‌గూడలో ఉద్రిక్తత
  • ఓ హత్యకేసులో పోలీసుల అదుపులోకి చిన్న శ్రీశైలం యాదవ్
  • తన ప్రచారాన్ని అడ్డుకునే కుట్రన్న నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ తండ్రి, రౌడీ షీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ అరెస్ట్‌తో యూసుఫ్‌గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్లారెడ్డిగూడలో జరిగిన ఓ హత్య కేసులో చిన్న శ్రీశైలం యాదవ్‌ను బైండోవర్ చేసేందుకు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

 విషయం తెలిసిన ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు సమీపంలోని శ్రీశైలం ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చిన్న శ్రీశైలం యాదవ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. తన తండ్రిని అదుపులోకి తీసుకోవడంపై నవీన్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకే పోలీసులు కుట్ర చేసి ఈ పనిచేశారని ఆరోపించారు.
Naveen Yadav
Chinna srisailm yadav
Jubilee Hills
Hyderabad
Police

More Telugu News