gvl: రాహుల్, కేసీఆర్, ఒవైసీ ఒక్కటవుతారు: జీవీఎల్

  • మహాకూటమి, టీఆర్ఎస్, ఎంఐఎం అన్నీ ఒకే తాను ముక్కలు
  • ఎన్నికల తర్వాత అందరూ భాయి భాయి అనుకుంటారు
  • కేసీఆర్ గురించి సోనియాగాంధీ ఒక్క మాట కూడా అనలేదు
మహాకూటమి, టీఆర్ఎస్, ఎంఐఎం అన్నీ ఒకే తాను ముక్కలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఎన్నికలయ్యాక రాహుల్, కేసీఆర్, ఒవైసీలు భాయి భాయిగా ఉంటారని చెప్పారు. బీజేపీని బలహీనపరిచేందుకు ఆ పార్టీలన్నీ కలసి నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సోనియాగాంధీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఒక్కమాట కూడా అనలేదనే విషయాన్ని గ్రహించాలని చెప్పారు.

గతంలో కాంగ్రెస్ నేతలు చేసిన అవినీతిపై నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదనే విధానపరమైన నిర్ణయాన్ని అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆనాడే తీసుకుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ చేస్తున్నారని విమర్శించారు.
gvl
Rahul Gandhi
kcr
owaisi
mahakutami
TRS
congress
mim

More Telugu News