kcr: కర్ణాటకలో బీజేపీకి సపోర్ట్ చేశారు.. తెలంగాణలో టీఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్నారు: వైసీపీపై చంద్రబాబు విమర్శలు

  • పవన్ కల్యాణ్ బీజేపీకి అండగా ఉన్నారు
  • టీఆర్ఎస్ కు వైసీపీ మద్దతు పలికింది
  • తెలంగాణ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ ఓడిపోవాలి
వైసీపీ, జనసేనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ మద్దతు పలికిందని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కే తమ మద్దతు అని మీటింగుల్లో వైసీపీ నేతలు చెబుతున్నారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బీజేపీకి అండగా ఉన్నారని చెప్పారు.
తెలుగువారందరూ కలిసుందామని తాను అంటుంటే... మీరెవరు చెప్పడానికి అని కేసీఆర్ తనను ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.

నాతో ఉన్న కేసీఆర్ ఇప్పుడు నన్నే అంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రమైన తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ ఓడిపోవాలని... ప్రజాకూటమి గెలవాలని అన్నారు. తొమ్మిదేళ్లలో హైదరాబాదును డెవలప్ చేసినప్పుడు అమరావతిని ఎందుకు చేయలేదని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని... ఈరోజు ఒకటే చెబుతున్నానని, ప్రపంచంలోని ఐదు అద్భుత నగరాల్లో అమరావతి ఒకటిగా ఉంటుందని చెప్పారు.
kcr
Chandrababu
Telugudesam
TRS
YSRCP
janasena
bjp
karnataka
telangana
amaravathi

More Telugu News