Telangana: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడానికి కోనసీమ పచ్చదనమే కారణం!: పవన్ కల్యాణ్

  • గిట్టుబాటు లేక రైతులు అల్లాడిపోతున్నారు
  • కొనసీమ పరిస్థితి దారుణంగా ఉంది
  • రైతులతో జనసేనాని ముఖాముఖి
కొనసీమలో పంటలు పండక, గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ బయటి వ్యక్తులు మాత్రం వాస్తవాలు తెలియక..‘మీకేమండి!.. అద్భుతమైన కోనసీమ ఉంది. పంటలు బాగా పండుతాయి’ అని చెబుతూ ఉంటారని వ్యాఖ్యానించారు. కోనసీమ ప్రాంతంలో కాలువలు పూడికతో నిండిపోయినా పట్టించుకునే నాథుడు లేడని పవన్ కల్యాణ్ విమర్శించారు.

రైతులకు మద్దతు ధర, మార్కెట్ కల్పనపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. పచ్చటి కోనసీమకు అందరి దిష్టి తగిలిందని జనసేనాని వ్యాఖ్యానించారు. అసలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావడానికి, తెలంగాణ ఓ రాష్ట్రంగా విడిపోవడానికి కోనసీమ పచ్చదనమే కారణమని అభిప్రాయపడ్డారు.

కానీ వాస్తవంలో పొలాల్లో మంచినీళ్లు వేసే పైపులు కూడా పగిలిపోయి, నేల నుంచి ఉప్పునీటి ఊట వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ నీళ్లు అంటే కొబ్బరి నీళ్లలా ఉంటాయన్న నానుడి ఉందనీ, ఇప్పుడు మాత్రం ఉప్పునీళ్లు వస్తున్నాయని చెప్పారు.
Telangana
special state
greenary
Pawan Kalyan
janasena
farmers

More Telugu News