దొంగతనంగా కాదు, చట్టబద్ధంగానే కొన్నా.. లగ్జరీ కార్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు బయటపెట్టిన సుజనా చౌదరి!
- ఈడీ అధికారులు నాపై బురద చల్లుతున్నారు
- ఒక్క రోజు దాడిచేసి అభాండాలు మోపుతారా?
- ట్విట్టర్ లో స్పందించిన కేంద్ర మాజీ మంత్రి
ఈడీ అధికారులు ఒక్కరోజు తనిఖీలు నిర్వహించి తనపై బురద చల్లే ప్రయత్నం చేశారని సుజనా చౌదరి ఆరోపించారు. తానేమీ తప్పు చేయలేదనీ, తనవద్ద ఉన్న కార్లు డొల్ల కంపెనీల నుంచి కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. ఇంట్లో ఉన్న కార్లు అన్నింటిని చట్టబద్దంగానే కొనుగోలు చేశామన్నారు. ఇందుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కార్ల కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాల కాపీలను ఆయన బయటపెట్టారు.

