jhanvi kapoor: జాన్వీ నోట విజయ్ దేవరకొండ మాట!

  • 'కాఫీ విత్ కరణ్' షోకు జాన్వీ కపూర్ 
  • విజయ్ దేవరకొండగా మారిపోతా
  • భవిష్యత్తులో విజయ్ తో సినిమా చేస్తా  
ఇటీవల విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ సినిమా చేయనున్నట్టు ఒక వార్త షికారు చేసింది. ఆ వార్తలో నిజం లేదు గానీ, జాన్వీ కపూర్ నోట విజయ్ దేవరకొండ మాట వచ్చిందనేది మాత్రం వాస్తవం. కరణ్ జోహర్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' షోకు ఇటీవల శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వెళ్లింది. ఆ సమయంలోనే 'రేపు పొద్దున్న నిద్రలేవగానే నువ్వొక మగాడిగా మారిపోతావ్' అంటే, ఎవరిలా మారిపోవాలని కోరుకుంటావు?' అనే ప్రశ్న జాన్వీకి ఎదురైంది.

అందుకు జాన్వీ స్పందిస్తూ .. 'విజయ్ దేవరకొండ మాదిరిగా మారిపోతాను' అంటూ సమాధానమిచ్చింది. ఉత్తరాదిన ఎంతోమంది యంగ్ హీరోలు ఉండగా, దక్షిణాదిన హీరోగా ఎదుగుతోన్న విజయ్ దేవరకొండ పేరును జాన్వీ కపూర్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోతోందో చెప్పడానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఇక భవిష్యత్తులో విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తానని కూడా జాన్వీ చెప్పడం విశేషం.  
jhanvi kapoor

More Telugu News