Khammam District: ఖమ్మం ఎన్నికల ప్రచార సభకు అగ్రనేతలు: మహాకూటమి నేతలు

  • రాహుల్‌, చంద్రబాబు ఒకే వేదిక పంచుకోనున్నారని వెల్లడి
  • సభకు దేశవ్యాప్త ప్రాధాన్యం ఉందని స్పష్టీకరణ
  • బీజేపీయేతర పార్టీలు కలిసి రావాలని పిలుపు
ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే ఎన్నికల ప్రచార సభకు మహాకూటమి అగ్రనేతలు తరలిరానున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టివిక్రమార్క, టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 28వ తేదీన జరిగే ఈ సభకు దేశవ్యాప్త ప్రాధాన్యం ఉందన్నారు. సోమవారం వారు సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హాజరై ఒకే వేదిక పంచుకోనున్నారని, ఒక మంచి సందేశాన్ని ఇవ్వనున్నారని తెలిపారు. సభకు మహాకూటమి నేతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు. లౌకిక వాదాన్ని కాపాడుకునేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
Khammam District
Mallu Bhatti Vikramarka
nama nageswararao

More Telugu News