ముంబై ఉగ్రదాడి సూత్రధారుల సమాచారం ఇవ్వండి.. రూ.35 కోట్లు అందుకోండి!: అమెరికా బంపర్ ఆఫర్
- నేటితో ముంబై దాడులకు పదేళ్లు పూర్తి
- 166 మందిని బలిగొన్న పాక్ ఉగ్రవాదులు
- నిందితులపై ఇంకా చర్యలు తీసుకోని పాక్
ముంబైపై జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు అమెరికా పౌరులు సైతంం ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ దాడికి కుట్ర పన్నినవారు, సహకరించినవారికి శిక్ష పడేలా అవసరమైన సమాచారం తెలిపినవారికి రూ.35.21 కోట్లు (5మిలియన్ డాలర్లు) అందిస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడికి లష్కరే నేతలు హఫీజ్ సయీద్, జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ, హమ్జాలు కుట్ర పన్నినట్లు భారత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. వీరి పాత్రకు సంబంధించి సాక్ష్యాలను భారత్ పాకిస్తాన్ కు సమర్పించినా, ఆ దేశం ఉగ్రమూకలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.