sekhar kammula: కొత్త అమ్మాయినే హీరోయిన్ గా సెట్ చేసిన శేఖర్ కమ్ముల

  • శేఖర్ కమ్ముల నుంచి మరో సినిమా 
  • హీరోగా కొత్త కుర్రాడు 
  • డిసెంబర్ 2వ వారంలో సెట్స్ పైకి    
టాలీవుడ్ దర్శకులలో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేకమైన స్థానం వుంది. కథాకథనాలకే ఆయన ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాడు. పాత్రలకి తగిన నటీనటులనే ఎంపిక చేసుకుంటాడు. సహజత్వానికి దగ్గరగా ఉండటం వల్లనే ఆయన సినిమాలు ప్రేక్షకుల మనసులను చేరుతుంటాయి. అందుకు 'ఫిదా' సినిమా కూడా ఒక ఉదాహరణ. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ, ఆయన తొందరపడకుండా మరో మంచికథను సిద్ధం చేసుకున్నాడు.

కొత్త నటీనటులతో ఆయన ఈ సినిమాను రూపొందించనున్నాడు. కొత్త కుర్రాడిని హీరోగా తీసుకున్న ఆయన, విజయవాడకి చెందిన ఒక అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నాడనేది తాజా సమాచారం. ఆ అమ్మాయి మంచి డాన్సర్ అని తెలుస్తోంది. డిసెంబర్ 2వ వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. ఈ లోగానే శేఖర్ కమ్ముల పూర్తి వివరాలు ప్రకటించే ఛాన్స్ ఉందట.     
sekhar kammula

More Telugu News