Allu Arjun: విక్రమ్ కుమార్ కే కథ వినిపించిన బన్నీ... కాంబినేషన్ సెట్టైపోయినట్టే!

  • బన్నీకి కథ వినిపించిన తమిళ రచయిత 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన బన్నీ 
  • పక్కన పెట్టేసిన విక్రమ్ కుమార్ కథ
విభిన్న కథాచిత్రాల దర్శకుడిగా విక్రమ్ కుమార్ కి మంచి పేరుంది. కొంతకాలంగా ఆయన బన్నీ కోసం ఒక కథను సిద్ధం చేసే పనిలోనే వున్నాడు. సెకండాఫ్ విషయంలో బన్నీ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో, ఆయనని ఒప్పించడానికి విక్రమ్ కుమార్ గట్టి కసరత్తునే చేస్తున్నాడు. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల బన్నీకి ఓ తమిళ రచయిత ఒక కథను వినిపించాడట.

ఆ కథ బన్నీకి కొత్తగా అనిపించడంతో, వెంటనే విక్రమ్ ను పిలిపించి ఆ కథను వినిపించాడట. ఈ కథను చేసేద్దామని ఉత్సాహాన్ని చూపించాడట. తాను సిద్ధం చేసిన కథను పక్కకిపెట్టవలసి వస్తున్నందుకు విక్రమ్ కుమార్ కాస్త ఫీలైనా, బన్నీ చెప్పిన కథను చేయడానికి ఓకే చెప్పేశాడట. ఇద్దరూ కలిసి ఈ కథను ఓకే చేసేసుకున్నారు. త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసిన తరువాతనే బన్నీ - విక్రమ్ కుమార్ ల ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ లోగా విక్రమ్ కుమార్ మరో కథతో మరో హీరోను సెట్ చేసుకునే అవకాశం వుంది.     
Allu Arjun
vikram kumar

More Telugu News