kukatpalli: అక్క కోసం తమ్ముళ్లు... కూకట్‌పల్లిలో ప్రచారానికి జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ రెడీ!

  • సుహాసినికి మద్దతుగా ఒక రోజు ప్రచారం చేస్తారని ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి వెల్లడి
  • ఇతర ప్రాంతాల్లో ప్రచారంపై నిర్ణయం తీసుకోలేదు
  • డిసెంబరు మొదటివారంలో బాలకృష్ణ ప్రచారం
కూకట్‌పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా ప్రచారానికి ఆమె సోదరులు, సినీ నటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు పచ్చజెండా ఊపారు. రసవత్తరంగా మొదలై ఆసక్తిదాయకంగా మారిన కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా నందమూరి హరికృష్ణ తనయ సుహాసినిని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. సెటిలర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు ప్రచారం చేస్తే కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.

ఈ నేపధ్యంలో తమ అక్క తరపున ప్రచారానికి ఇద్దరు నటులు అంగీకరించారని, సుహాసినికి మద్దతుగా ఒక రోజు నియోజకవర్గంలో పర్యటిస్తారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి వెల్లడించారు. అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వీరు ప్రచారం చేస్తారా? లేదా? అన్న విషయంపై ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. సుహాసినికి మద్దతుగా ఆమె బాబాయ్‌, సినీనటుడు బాలకృష్ణ కూడా వచ్చే నెల మొదటి వారంలో ప్రచారం చేయనున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు.
kukatpalli
Telugudesam
junior NTR
kalyanram
peddireddy

More Telugu News