ambarish: అంబరీష్ భౌతికకాయం వద్ద వెక్కివెక్కి ఏడ్చిన మోహన్ బాబు.. సుమలతను ఓదార్చుతూ తల్లడిల్లిన చిరంజీవి.. వీడియో చూడండి

  • నిన్న తుదిశ్వాస విడిచిన కన్నడ రెబల్ స్టార్ అంబరీష్
  • షాక్ కు గురైన దక్షిణ భారత చిత్ర సీమ
  • అంబరీష్ కు నివాళి అర్పించిన పలువురు సినీ ప్రముఖులు
కన్నడ రెబల్ స్టార్, రాజకీయవేత్త అయిన అంబరీష్ నిన్న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో కార్డియాక్ అరెస్ట్ తో ఆయన మృతి చెందారు. ఆయన మరణంతో దక్షిణ భారత చిత్రసీమ షాక్ కు గురైంది. దక్షిణాదికి చెందిన సీనీ ప్రముఖులు బెంగళూరుకు వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. తన భార్య, కుమారుడు విష్ణులతో కలసి మోహన్ బాబు అంబరీష్ కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగాన్ని తట్టుకోలేక అంబరీష్ భౌతికకాయం వద్ద ఆయన వెక్కివెక్కి ఏడ్చారు. అనంతరం అంబరీష్ సతీమణి, సినీనటి సుమలతను పట్టుకుని కంటతడి పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అంబరీష్ కు నివాళి అర్పించారు. సుమలతను ఓదార్చారు. ఆప్తమిత్రుడిని కోల్పోయిన బాధతో ఆయన తల్లడిల్లిపోయారు.
ambarish
sumalatha
Chiranjeevi
mohanbabu
tollywood

More Telugu News