jagan: చివరి అంకానికి చేరిన జగన్ పాదయాత్ర.. శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశం

  • వీరఘట్టం మండలం కెల్ల వద్ద శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన జగన్
  • జిల్లా సరిహద్దుల్లో జగన్ కు ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
  • 10 నియోజకర్గాల్లో కొనసాగనున్న పాదయాత్ర
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర చివరి ఘట్టానికి చేరుకుంది. 12 జిల్లాలను పూర్తి చేసుకుని... చివరి జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించింది. వీరఘట్టం మండలం కెల్ల వద్ద అశేష జనసందోహం మధ్య జగన్ శ్రీకాకుళం జిల్లాలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర కొనసాగనుంది. జగన్ కు స్వాగతం పలికిన నేతల్లో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని, ధర్మాన కృష్ణదాసు తదితరులు ఉన్నారు. 
jagan
YSRCP
padayatra
Srikakulam District
veeraghattam

More Telugu News