Congress: నందమూరి సుహాసినికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాం: సర్వే సత్యనారాయణ

  • కాంగ్రెస్ కేబినెట్‌లో సుహాసినికి స్థానం
  • ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపించండి: పెద్దిరెడ్డి
  • రాక్షస పాలనకు చరమగీతం పాడండి: సుహాసిని
కూకట్‌పల్లి నుంచి ప్రజాకూటమి (టీడీపీ) అభ్యర్థిగా బరిలోకి దిగిన నందమూరి సుహాసినికి మంత్రి పదవి ఇస్తామని కేంద్ర మాజీ మంత్రి, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ తెలిపారు. ప్రజాకూటమి సారథ్యంలోని కాంగ్రెస్ అధికారంలోకి  వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. కేబినెట్‌లో సుహాసినికి స్థానం కల్పిస్తామన్నారు.

కంటోన్మెంట్ నుంచి పోటీ చేయడం తనకు ఇష్టం లేకపోయినా పార్టీ ఆదేశానుసారం పోటీ చేస్తున్నట్టు సత్యనారాయణ తెలిపారు. కంటోన్మెంట్ నుంచి తన గెలుపు ఖాయమన్న ఆయన మల్కాజిగిరి నుంచి టీడీపీ నేత పెద్దిరెడ్డి పార్లమెంటుకు పోటీ చేస్తే ఆయన గెలుపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన సుహాసినిని ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే స్థానికంగా ఉండి సేవ చేస్తానని, మహిళలకు అండగా ఉంటానని సుహాసిని హామీ ఇచ్చారు. మహాకూటమిని గెలిపించి ప్రస్తుత రాక్షస పాలనకు చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు.  
Congress
Telugudesam
Nandmuri suhasini
Kukatpally
peddireddy
sarve satyanarayana

More Telugu News