Chandrababu: చిరంజీవి పార్టీని అమ్ముకున్నారు.. ఇప్పుడు అదే పని చేసేందుకు పవన్ కల్యాణ్ వచ్చాడు: చంద్రబాబు

  • నా సిద్ధాంతాలు కరెక్ట్ అని చెప్పిన పవన్... ఇప్పుడు మోసగాడు అంటున్నారు
  • పవన్ ఊసరవెల్లి లాంటివాడు
  • కోడికత్తి జగన్ డ్రామానే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి గతంలో పార్టీని అమ్ముకుని వెళ్లిపోయారని... ఇప్పుడు అదే పని చేయడానికి పవన్ వచ్చాడని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తన సిద్ధాంతాలు కరెక్ట్ అని చెప్పిన పవన్.. ఇప్పుడు తననే మోసగాడు అంటున్నారని మండిపడ్డారు.

పవన్ ఒక ఊసరవెల్లి లాంటివాడని విమర్శించారు. ప్రజలను మోసం చేయడానికి వైసీపీ, జనసేనలు వచ్చాయని అన్నారు. కోడికత్తి కూడా జగన్ డ్రామానే అని దుయ్యబట్టారు. నిజాయతీగా పని చేస్తున్న తమపై సీబీఐ దాడులు జరుపుతున్నారని... ఇది ఎంత వరకు సబబని ప్రశ్నించారు. అనంతపురంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు విమర్శలు గుప్పించారు. జిల్లాలోని 14 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలను గెలిపించాలని కోరారు. 
Chandrababu
Pawan Kalyan
Chiranjeevi
jagan
kodikathi

More Telugu News