kcr: ఆనాడు వైశ్రాయ్ హోటల్లో మాతో పాటు కేసీఆర్ కూడా ఉన్నారు: రావుల

షార్ట్స్‌లో చూడండి
తెలుగు ప్రజలు ఉన్న ప్రతి చోటా తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఏపీ, తెలంగాణలోనే కాకుండా అండమాన్ లో కూడా టీడీపీ ఉందని చెప్పారు. టీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకుందని... అందుకే చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఏ ఒక్క తెలుగువాడికి సమస్య వచ్చినా వెంటనే చంద్రబాబు స్పందిస్తారని... అలాంటి వ్యక్తికి ఇక్కడ ఏం పని అని ఎలా అడుగుతారని ప్రశ్నించారు.

గతంలో మహబూబ్ నగర్ లో కేసీఆర్ గెలిచింది టీడీపీ అండతోనే అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని రావుల అన్నారు. వైశ్రాయ్ హోటల్ లో ఆనాడు తమతో పాటు కేసీఆర్ కూడా ఉన్నారని చెప్పారు. హైదరాబాదులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది చంద్రబాబేనని తెలిపారు. తెలంగాణకు, టీడీపీకి విడదీయలేని బంధం ఉందని చెప్పారు. రానున్న ఎన్నికలు నాలుగు పార్టీల కూటమికి, నలుగురు కుటుంబసభ్యులకు మధ్య జరుగుతున్న సంగ్రామమని అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారని... తొలి విడతలో 28, 29 తేదీల్లో ప్రచారాన్ని నిర్వహిస్తారని చెప్పారు.
Go Back to Shorts
kcr
Chandrababu
Telugudesam
TRS
ravula

More Telugu News