chattisgargh: ‘నేను చనిపోయినా వాడిని విడిచిపెట్టొద్దు’ అంటూ చేతిలో సూసైడ్ నోట్ రాసి యువతి ఆత్మహత్య!

జీవితాంతం తోడుంటానని మాటిచ్చిన ప్రియుడు పెళ్లి చేసుకోబోనని తెగేసి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన యువతి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు తన చావుకు ప్రియుడే కారణమని అరచేతితో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని సూరజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని భట్గావ్ పట్టణానికి చెందిన అక్షయ్ సింగ్, రాగిణి(19) ప్రేమించుకున్నారు. వీరి వివాహానికి ఇరువురి కుటుంబాలు కూడా అంగీకరించాయి. అయితే పెళ్లి ముహూర్తం కుదరకముందే ఈ జంట మధ్య వివాదం తలెత్తింది. అది చిలికిచిలికి గాలివానగా మారడంతో అసలు ఈ పెళ్లి చేసుకోబోనని అక్షయ్ తేల్చిచెప్పాడు.

దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన రాగిణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడి కారణంగానే తాను చనిపోతున్నట్లు చేతిలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. తాను చనిపోయినా ప్రియుడు అక్షయ్ ను మాత్రం విడిచిపెట్టొద్దని కోరింది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
chattisgargh
suicide
note
on hand

More Telugu News