Chandrababu: ఒకరు డ్రామాలు ఆడుతూ అసెంబ్లీకి రారు.. ఇంకొకరి మాటలు కోటలు దాటుతాయి: చంద్రబాబు

  • అనంతపురంలో బాబు రెండు రోజుల పర్యటన
  • జగన్, పవన్‌లపై విమర్శలు
  • కేంద్రం నమ్మక ద్రోహం చేసిందన్న సీఎం
మోదీ ప్రభుత్వం ఓవైపు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంటే ఒకరు కోడి కత్తి డ్రామాలు వేసుకుంటూ రోడ్డున పడి తిరుగుతున్నారని, మరొకరి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, చేతలు మాత్రం గడప దాటడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం అనంతపురం వచ్చిన సీఎం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం నమ్మక ద్రోహానికి పాల్పడిందని, మోదీ ప్రభుత్వంతో పోరాడుతున్న తమకు అందరూ అండగా నిలవాలని కోరారు.

ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం కోడి కత్తి డ్రామాలు వేస్తోందని, అవిశ్వాస తీర్మానం పెడితే పార్లమెంటును స్తంభింపజేస్తామన్న ప్రతిపక్షం తీరా తాము ఆ పని చేస్తే పారిపోయిందని ఎద్దేవా చేశారు. అనంతపురాన్ని ఆదుకుంటానని చెప్పిన పవన్ మళ్లీ ఇటువైపు చూడలేదని విమర్శించారు. వీరి మాటలు కోటలు దాటుతాయి కానీ, చేతలు మాత్రం గడప దాటవని ఎద్దేవా చేశారు.
Chandrababu
Pawan Kalyan
Jagan
YSRCP
Jana Sena
Anantapur District

More Telugu News