Pawan Kalyan: ఇసుక మాఫియా చేసే ప్రతి ఎమ్మెల్యే టపాకాయల్లా పేలిపోతారు: పవన్

  • జగన్‌లా నేను పారిపోను
  • పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు
  • అవినీతి అధికారులను వదిలిపెట్టేది లేదు
ఇసుక మాఫియా చేసే ప్రతి ఎమ్మెల్యే టపాకాయల్లా పేలిపోతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. నేడు ఆయన తూర్పుగోదావరి జిల్లా మండపేట కలువ పువ్వు సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని వైసీపీ అధినేత జగన్ మాదిరిగా తాను పారిపోనన్నారు.

జగన్, చంద్రబాబు ఇద్దరికీ అవినీతిరహిత పాలన అందించటం రాదని.. వారు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేరని పవన్ విమర్శించారు. జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి అధికారులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు వచ్చానని పవన్ తెలిపారు.
Pawan Kalyan
Jagan
Chandrababu
East Godavari District
Politics

More Telugu News