Cricket: వరుణుడి దెబ్బకి భారత్-ఆసీస్ రెండో టీ20 రద్దు!

  • వర్షం కారణంగా రెండుసార్లు ఓవర్ ల కుదింపు 
  • వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్ రద్దు
  • ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఆస్ట్రేలియా
వరుణుడి దెబ్బకి భారత్-ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 రద్దయింది. వర్షం కారణంగా అంపైర్లు ఓవర్లని రెండుసార్లు కుదించారు. వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్ ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, ఖలీల్ చెరో రెండు వికెట్లు తీయగా, బుమ్రా, కుల్‌దీప్, కృనాల్ తలో వికెట్ తీశారు. కాగా, మూడు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది.
Cricket
Australia vs India
t20

More Telugu News