sanjay raut: కేవలం 17 నిమిషాల్లోనే బాబ్రీ మసీదును కూల్చేశాం: శివసేన సంచలన వ్యాఖ్యలు

  • రాముడి ఆలయాన్ని నిర్మించేందుకు ఏళ్లకు ఏళ్లు ఎందుకు పడుతోంది?
  • అయోధ్యలో ఆలయాన్ని నిర్మించాల్సిందే
  • బీజేపీ అధికారంలో ఉన్నా జాప్యం ఎందుకు జరుగుతోంది?
అయోధ్యలోని బాబ్రీ మసీదుపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం 17 నిమిషాల్లోనే బాబ్రీ మసీదును కూల్చేశామని ఆయన అన్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అయోధ్యకు వెళుతున్న నేపథ్యంలో, మీడియాతో రౌత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రాముడి ఆలయం నిర్మించాల్సిందేనని ఆయన అన్నారు.

 ఆలయాన్ని నిర్మిస్తామని గత ఎన్నికల్లో తాము హామీ ఇచ్చామని చెప్పారు. యూపీలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని... అయినప్పటికీ ఆలయ నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతోందని ఆయన మండిపడ్డారు. మసీదును కూల్చేందుకు రామభక్తులకు 17 నిమిషాలు పడితే... ఆలయాన్ని నిర్మించేందుకు ఏళ్లకు ఏళ్లు ఎందుకు పడుతోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయవర్గాల్లో వేడిని పుట్టిస్తున్నాయి. 
sanjay raut
shivsena
ayodhya
babri masjid
ram
temple
bjp

More Telugu News