rahul: రాహుల్ దర్శకత్వంలోనే నాగార్జున తదుపరి చిత్రం?

  • 'బంగార్రాజు' కథపై కల్యాణ్ కృష్ణ కసరత్తు
  • రొమాంటిక్ లవ్ స్టోరీపై కూర్చున్న రాహుల్ 
  • త్వరలోనే పూర్తి వివరాలతో ప్రకటన
ఒక వైపున నాగార్జున కోసం దర్శకుడు కల్యాణ్ కృష్ణ 'బంగార్రాజు' కథను తయారు చేస్తున్నాడు. మరో వైపున రాహుల్ రవీంద్రన్ .. నాగార్జున కోసం ఒక రొమాంటిక్ స్టోరీని సిద్ధం చేస్తున్నాడు. ఎవరు ముందుగా తనని మెప్పించగలిగితే వాళ్లతో సెట్స్ పైకి వెళ్లే ఉద్దేశంతో నాగార్జున వున్నారు. ఈ క్రమంలో నాగార్జునకి తాను వినిపించిన లైన్ పై గట్టిగానే కసరత్తు చేసి పూర్తి కథను వినిపించిన రాహుల్, ఆయనను మెప్పించాడనేది తాజా సమాచారం.

నాగార్జున మేనల్లుడు సుశాంత్ తో తెరకెక్కిన 'చిలసౌ' సినిమా ద్వారానే రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా చూసిన తరువాతనే రాహుల్ ని కథ తయారు చేసుకోమని నాగార్జున చెప్పారు. అలా కథను రెడీ చేసిన రాహుల్, నాగ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చేసుకున్నాడు. ఈ సినిమాకి 'మన్మథుడు 2' అనే టైటిల్ ను పెట్టనున్నారనీ, త్వరలోనే పూర్తి వివరాలతో ప్రకటన చేయనున్నారని చెప్పుకుంటున్నారు. 
rahul
nagarjuna

More Telugu News