kct: నీళ్లు కావాలని రెడ్యానాయక్ నాతో కొట్లాడారు: కేసీఆర్

  • డోర్నకల్ నియోజకవర్గం నుంచి 84 మంది గిరిజనులు సర్పంచ్ లు కాబోతున్నారు
  • రాష్ట్ర రాజకీయాల్లో రెడ్యానాయక్ సీనియర్ నేత
  • రెడ్యానాయక్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం
డోర్నకల్ ను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని... కానీ, డోర్నకల్ లో 84 తండాలను గ్రామ పంచాయతీలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. త్వరలోనే డోర్నకల్ నియోజకవర్గం నుంచి 84 మంది గిరిజనులు సర్పంచ్ లు కాబోతున్నారని చెప్పారు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ కూటమికి... నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్ఎస్ కు మధ్య ఈ ఎన్నికలు జరగబోతున్నాయని తెలిపారు. రెడ్యానాయక్ రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడని... పాలేరు నుంచి డోర్నకల్ కు నీళ్లు కావాలని తనతో కొట్లాడారని చెప్పారు. డోర్నకల్ కు ఎస్సారెస్పీ కాలువ వస్తోందని తెలిపారు. గిరిజనులు ఎక్కువగా ఉండే డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని చెప్పారు. డోర్నకల్ బహిరంగసభలో ప్రసంగిస్తూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
kct
TRS
dornakal
redya naik

More Telugu News