Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పైర‌వీలు, సిఫార‌సులు అనే మాట లేకుండా అంతా ఆన్‌లైన్‌ చేశాం.. అందుకే ల‌క్ష్యం ల‌క్ష‌లు దాటింది: చంద్రబాబు

  • 'ముఖ్యమంత్రి యువనేస్తం' రికార్డు సృష్టించింది 
  • ఈ కార్యక్రమం అమలులో అనేక జాగ్రత్తలు తీసుకున్నాం
  • 4 ల‌క్ష‌ల మందికి పైగా ముఖ్య‌మంత్రి యువ‌నేస్తాల‌య్యారు
  • డిసెంబర్ 1 నుంచి నిరుద్యోగ భృతి వారి బ్యాంకు ఖాతాల‌కు నేరుగా జ‌మ చేస్తాం
దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేని అతి పెద్ద నిరుద్యోగ భృతి కార్యక్రమంగా 'ముఖ్యమంత్రి యువనేస్తం' రికార్డు సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒక్క క్లిక్ తో సంక్షేమ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోగానే అర్హులా, కాదా అని అప్పటికప్పుడే చెప్పే విధానం దేశంలో కేవలం ఒక్క ముఖ్యమంత్రి యువనేస్తంలో మాత్రమే ఉందని, గతంలో అనేక రాష్ట్రాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినా సరైన సమాచార అనుసంధానం, శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, పారదర్శకత పాటించకపోవడంతో ఈ కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేశాయని ముఖ్యమంత్రి అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమం అమలులో అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, ఫలితంగా ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 4 ల‌క్ష‌ల మందికి పైగా ముఖ్య‌మంత్రి యువ‌నేస్తాల‌య్యారని, వీరంద‌రికీ డిసెంబర్ 1 నుంచి నిరుద్యోగ భృతి వారి బ్యాంకు ఖాతాల‌కు నేరుగా జ‌మ చేస్తామని చంద్రబాబు తెలిపారు. పైర‌వీలు, సిఫార‌సులు అనే మాట లేకుండా అంతా ఆన్‌లైన్‌ చేశామని, అందుకే ల‌క్ష్యం ల‌క్ష‌లు దాటిందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. నిరుద్యోగ‌భృతి అందుకుంటూనే, వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన యువత ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధిలో కీల‌క భాగ‌స్వామ్యం కానుందని చంద్రబాబు తన ధీమా వ్యక్తం చేశారు.
Chandrababu
Andhra Pradesh
yuva nestham

More Telugu News