komatireddy: కేసీఆర్ ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది: కోమటిరెడ్డి

  • ప్రజలకు నాలుగేళ్ల పాటు నరకం చూపించారు
  • గారడి మాటలతో పాలన సాగించారు
  • అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు
ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లిపోతారని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ఇప్పటికే కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని... ఆయన ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలకు నాలుగున్నరేళ్ల పాటు కేసీఆర్ నరకం చూపించారని మండిపడ్డారు. గారడి మాటలతో ప్రజలను మభ్యపెడుతూ కేసీఆర్ పాలన సాగించారని... అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ కు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. ఈరోజు నల్గొండలోని ఛాయా సోమేశ్వరస్వామి ఆలయంలో కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ద్వారకాపురి కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.
komatireddy
nalgonda
congress
kcr
TRS

More Telugu News