TRS: నా వివరణ కోరకుండా బహిష్కరించడం అన్యాయం : ఎమ్మెల్సీ యాదవరెడ్డి

  • బహిష్కరణ లేఖ ఇంకా నా చేతికి రాలేదు
  • నేను ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు
  • టీఆర్‌ఎస్ కు సిద్ధాంతం లేదని దీంతో అర్థమైంది
'నేను ఏ తప్పు చేయలేదు, ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. అయినా నన్ను పార్టీ నుంచి బహిష్కరించడం బాధాకరం. కనీసం నా వివరణ కూడా అడగకుండా చర్యలకు పాల్పడడం అన్యాయం’ అని శాసన మండలి సభ్యుడు కె.యాదవరెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి యాదవరెడ్డిని బహిష్కరించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.

 బహిష్కరణ లేఖ తనకు ఇంకా అందలేదని చెప్పారు. ఈ చర్యతో టీఆర్‌ఎస్‌కు ఎటువంటి సిద్ధాంతం లేదని అర్థమైందన్నారు. తన మీద చర్యలు తీసుకునేకంటే చేతనైతే తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్‌ విసిరారు. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలో స్పందిస్తానని తెలిపారు.
TRS
yadavareddy

More Telugu News