MLC: ఎమ్మెల్సీ యాదవరెడ్డిని సస్పెండ్ చేసిన కేసీఆర్!

  • పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు
  • పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు
  • కాంగ్రెస్ లో చేరే అవకాశం!
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలపై ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. యాదవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని గత కొంత కాలంగా ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే యాదవరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం ప్రకటించింది. కాగా, తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? లేక మరేదైనా పార్టీని ఆశ్రయిస్తారా? అన్న విషయమై యాదవరెడ్డి ఇంకా స్పందించలేదు.
MLC
Yadavareddy
Congress
Suspend
KCR

More Telugu News