Chandrababu: గడువు తీరకముందే అసెంబ్లీని రద్దు చేయడం అప్రజాస్వామికం: చంద్రబాబు

  • జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దుపై చంద్రబాబు ఆగ్రహం
  • బీజేపీ నేతల ఫాసిస్ట్ చర్యలకు పరాకాష్ట
  • గవర్నర్‌ను కోరినా స్పందించకపోవడం దారుణం
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడువు తీరకముందే అసెంబ్లీని రద్దు చేయడం అప్రజాస్వామికమన్నారు. కేంద్రం చర్యలను దేశం మొత్తం ముక్త కంఠంతో ఖండించాలన్నారు. బీజేపీ నేతల ఫాసిస్ట్ చర్యలకు అసెంబ్లీ రద్దును పరాకాష్టగా పేర్కొన్నారు. 56 మంది సభ్యుల బలం ఉందని గవర్నర్‌ను పీడీపీ కోరినా స్పందించకపోవడం దారుణమని చంద్రబాబు అన్నారు.
Chandrababu
Jammu And Kashmir
Assembly
BJP
Narendra Modi

More Telugu News