Sania Mirza: తమ ముద్దుల కుమారుడికి నామకరణం చేసిన సానియా మీర్జా దంపతులు

  • కొడుకుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన సానియా
  • చిన్నారితో మధుర క్షణాలు అంటూ క్యాప్షన్
  • కుమారుడికి ఇజాన్ మీర్జా మాలిక్‌గా నామకరణం
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్‌మాలిక్ దంపతులకు ఇటీవల కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. ఆ చిన్నారికి నామకరణం కూడా చేశారు. తన చిన్నారి కొడుకును ఎత్తుకున్న ఫోటోను సానియా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలలో పోస్ట్ చేశారు. పెళ్లైన ఎనిమిదేళ్లకు పుట్టిన మగబిడ్డకు సానియా, షోయబ్ దంపతులు ఇజాన్ మీర్జా మాలిక్‌గా నామకరణం చేశారు. ‘చిన్నారితో మధుర క్షణాలు’ అని క్యాప్షన్ ఇచ్చి చిన్నారితో తీయించుకున్న ఫోటోను సానియా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
Sania Mirza
Soyab Malik

More Telugu News