Chandrababu: చంద్రబాబుతో భేటి అయిన ప్రముఖ సినీ నటి దివ్యవాణి

  • ఇటీవల చంద్రబాబును కలిసిన మంజు భార్గవి
  • నేడు చంద్రబాబుతో దివ్యవాణి భేటి
  • చంద్రబాబు దార్శనికత వల్ల ఏపీ అభివృద్ధి
ముఖ్యమంత్రి చంద్రబాబుతో వరుసగా నటీమణులు భేటి అవుతున్నారు. మొన్నటికి మొన్న ప్రముఖ నటి మంజు భార్గవి.. చంద్రబాబుతో భేటి అయ్యారు. నేడు దివ్యవాణి భేటి కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో దివ్యవాణి..  చంద్రబాబును కలిశారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును ప్రశంసలలో ముంచెత్తారు. చంద్రబాబు దార్శనికత వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టీడీపీ తరుఫున ప్రచారం నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబుకు చెప్పినట్టు దివ్యవాణి తెలిపారు.
Chandrababu
Divyavani
vundavalli
Andhra Pradesh
Telangana

More Telugu News