Akula Hanmandlu: చెప్పులు, రాజీనామా పత్రాలతో అభ్యర్థి వినూత్న ప్రచారం

  • వినూత్న రీతిలో సాగుతున్న ప్రచారం
  • చెప్పుతో కొట్టి పని చేయించుకోండి
  • రాజీనామా పత్రాలను అసెంబ్లీకి పంపండి
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఆందోళన పెరిగిపోతోంది. వినూత్న రీతిలో ప్రచారం కొనసాగిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలా అండగా ఉంటారో గ్రామగ్రామానికి తిరిగి వెల్లడిస్తున్నారు. ఓ స్వతంత్ర అభ్యర్థి చేస్తున్న ప్రచారం మాత్రం ప్రజలను ఆకట్టుకుంటోంది.

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆకుల హన్మాండ్లు తన రాజీనామా పత్రాలు, చెప్పులతో వినూత్న ప్రచారానికి తెరదీశారు. గెలిచిన తర్వాత తానిచ్చిన హామీలు నెరవేర్చకుంటే చెప్పుతో కొట్టి పనిచేయించుకోండని వెల్లడిస్తున్నారు. అంతేకాదు.. తను పనిచేయకుంటే రాజీనామా పత్రాన్ని ఎవ్వరైనా సరే అసెంబ్లీకి పంపి తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయించవచ్చని స్పష్టం చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు.
Akula Hanmandlu
Jagityal dist
Korutla
Slippers

More Telugu News