somnath bharathi: మహిళా యాంకర్ ను దూషించిన సోమనాథ్ భారతి.. కేసు నమోదు

  • ఫోన్ ద్వారా ఓ టీవీ ఛానల్ చర్చలో పాల్గొన్న సోమనాథ్ భారతి
  • యాంకర్ ను తీవ్ర పదజాలంతో తిట్టాడనేది ఆరోపణ
  • నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేసిన టీవీ ఛానల్ యాజమాన్యం
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై పోలీసు కేసు నమోదైంది. ఓ మహిళా యాంకర్ ను రాయకూడని పదజాలంతో తిట్టాడనే ఆరోపణలో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, మంగళవారం సాయంత్రం నోయిడాకు చెందిన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో సోమనాథ్ భారతి ఫోన్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మహిళా యాంకర్ ను తీవ్ర పదజాలంతో తిట్టాడనేది ఆయనపై ఉన్న ఆరోపణ. సదరు టీవీ ఛానల్ యాజమాన్యం నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సోమనాథ్ భారతి మాట్లాడుతూ, ఆడియో టేపును ఎడిట్ చేశారని, వాయిస్ లో కూడా తేడా ఉందని అన్నారు. మొత్తం ఆడియో టేప్ ను విడుదల చేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలకు దిగుతానని చెప్పారు. 
somnath bharathi
anchor
abuse
case
aap

More Telugu News