ఓటరు కార్డుకు రూ.25 కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు: తెలంగాణ ఎన్నికల అధికారి డా. రజత్ కుమార్
- కొత్త వారికి ఇంటి వద్ద లేదా పోలింగ్ బూత్ వద్ద ఉచితంగా కార్డులు
- పాత కార్డుల వారు మాత్రం కేవలం రూ.25 మాత్రమే చెల్లించాలి
- అదనంగా ఎవరయినా వసూలు చేస్తే 1950 నెంబర్ కి ఫిర్యాదు చేయండి
ఓటరుగా లోగడ నమోదయిన వారు ‘మీసేవ’ లో కేవలం రూ.25 మాత్రమే చెల్లిస్తే చాలు. ఇలా రూ.25కు మించి అదనంగా ఎవరయినా వసూలు చేసిన పక్షంలో పూర్తి వివరాలతో 1950 నెంబర్ కి ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. కొత్తగా ఓటర్లుగా నమోదు అయిన వారికి ఇళ్ల వద్ద ఎపిక్ కార్డులను బూత్ స్థాయి అధికారులు ఉచితంగా అందజేస్తారని ఆయన వివరించారు.