vijay devarakonda: అసంతృప్తిని వ్యక్తం చేసిన విజయ్ దేవరకొండ .. 'డియర్ కామ్రేడ్' రీషూట్

  • 'నోటా' పరాజయం ప్రభావం 
  • 'టాక్సీవాలా' విషయంలో టెన్షన్ 
  • పక్కాగా ప్లాన్ చేసుకుంటున్న విజయ్  
ఒకేసారి వరుస సినిమాలు ఒప్పేసుకుని, ఆ సినిమాలకి సంబంధించిన కథలపై పూర్తి దృష్టిపెట్టలేకపోయినట్టు ఇటీవల విజయ్ దేవరకొండ చెప్పాడు. 'నోటా' పరాజయంపాలు కావడం .. 'టాక్సీవాలా' విషయంలో టెన్షన్ పడటమే అందుకు కారణం. అందువల్లనే ఇకపై కథలపై గట్టి కసరత్తు చేసిన తరువాతనే రంగంలోకి దిగాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అలాగే ఎప్పటికప్పుడు అవుట్ పుట్ చూసుకుంటూ ముందుకెళ్లాలని భావిస్తున్నాడు.

తనకి గల క్రేజ్ ను నిలబెట్టుకోవడం కోసమే ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడు. అందులో భాగంగానే 'డియర్ కామ్రేడ్' సినిమాకి సంబంధించి ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ చూసిన ఆయన, కొన్ని సీన్స్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశాడట. ఆయన సూచన మేరకు ఆ సీన్స్ రీ షూట్ పెట్టుకున్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ సినిమా వచ్చే వేసవిలో కాకుండా, దసరా తరువాత రావొచ్చని అంటున్నారు. ఆలస్యమైనా ఫరవాలేదు .. కంటెంట్ కరెక్టుగా ఉండాలనే ఉద్దేశంతోనే విజయ్ దేవరకొండ ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.  
vijay devarakonda

More Telugu News