kavitha: కూటమి ప్రభావం ఎక్కడా లేదు: టీఆర్ఎస్ ఎంపీ కవిత

షార్ట్స్‌లో చూడండి
డిసెంబర్ 11 తర్వాత కేసీఆర్ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని... అందులో ఎలాంటి సందేహం లేదని ఎంపీ కవిత జోస్యం చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన కేసీఆర్ మరోసారి సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో మహాకూటమి ప్రభావం ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేసినట్టేనని అన్నారు. జగిత్యాలలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఉన్న అన్ని సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. 
Go Back to Shorts
kavitha
kcr
Chandrababu
TRS
nizamabad

More Telugu News