Andhra Pradesh: జగన్ కు ‘భాస్కర్ అవార్డ్ ఫర్ వరస్ట్ యాక్షన్’ ఇవ్వొచ్చు!: నారా లోకేశ్

  • జగన్ వి చెత్త నటన, అట్టర్ ఫ్లాప్ డ్రామాలు
  • కోడికత్తి, అంబులెన్స్, ఆవు అందులో భాగమే
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన ఏపీ మంత్రి
చెత్త నటన, అట్టర్ ఫ్లాప్ డ్రామాలకు అవార్డులు పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నింటిని దక్కించుకుంటారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ తొలుత కోడికత్తి డ్రామా ఆడారనీ, ఆ తర్వాత 108 డ్రామా చేశారని పేర్కొన్నారు. తాజాగా మొన్న ఆవు డ్రామాను కూడా ఆడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చెత్త నటనకు, విఫలమైన డ్రామాలకు అవార్డులు ఇవ్వాల్సివస్తే జగన్ మొత్తం అవార్డులను కొల్లగొడతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ చెత్త నటనకు నిలబడి చప్పట్లతో అభినందిస్తున్నామనీ, ఆయనకు ‘బద్దం భాస్కర్(అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం) అవార్డ్ ఫర్ వరస్ట్ యాక్టింగ్’ దక్కుతుందని మంత్రి సెటైర్ వేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.




Andhra Pradesh
Nara Lokesh
Jagan
criticise
bad acting
flop drama

More Telugu News